అత్తింటి ముందు కోడలి 'న్యాయ' పోరాటం..

by Aamani |
అత్తింటి ముందు కోడలి న్యాయ పోరాటం..
X

దిశ, గోదావరిఖని : తన భర్త సూర్యదేవర హరినాథ్ మరణానంతరం తన ఇద్దరు పిల్లలను తనకు కాకుండా చేసి... కనీసం భర్త ఆస్తిలో వాటా ఇవ్వకుండా రోడ్డుపాలు చేశారంటూ... అత్తింటి వారి ఎదుట ఓ కోడలు న్యాయపోరాటానికి దిగింది. కోర్టు ఉత్తర్వులు కూడా తనకు అనుకూలంగానే వచ్చినప్పటికీ.. తన ఆస్తి తనకు ఇవ్వకుండా బేఖాతరు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం నాడు గోదావరిఖని రమేష్ నగర్ లోని సుజాత తన అత్తగారింటికి చేరుకున్న కోడలు ఆందోళనకు దిగింది. అనారోగ్యంతో చనిపోయిన తన భర్తకు చెందిన ఆస్తి తనకు ఇవ్వాలని, అంతేకాకుండా తన ఇద్దరు పిల్లలను తనకు అప్పగించాలని వేడుకుంటుంది. ఈ పోరాటంలో ఆమెకు న్యాయం జరుగుతుందా? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed