- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిండు సభలో క్షమాపణలు కోరిన హోంమంత్రి అనిత (వీడియో వైరల్)
దిశ, వెబ్ డెస్క్: ఏపీ శాసనమండలి ఈ రోజు వాడీ వేడీగా సాగింది. అటు వైసీపీ(Ycp), ఇటు టీడీపీ(Tdp) సభ్యుల మధ్య మాటలయుద్ధం నడించింది. ప్రశ్నలు, కోపాలు, క్షమాపణలతో పెద్దల సభ అధ్యాంతం రక్తికట్టించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మండలి సభలో రాష్ట్ర హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Mlc Bosta Satyanarayana) డిమాండ్ చేశారు. సభలో ఉన్న 58 మంది కోసం కాదని, రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల కోసం సమాధానం చెప్పాలని కోరారు. హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anita)రాజకీయాలు మాట్లాడుతున్నారని, శాంతి భద్రతలపై సూటిగా సమాధానం చెప్పడంలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రస్తావించారని గుర్తు చేశారు. రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కాకుండా హోంమంత్రి అనిత తాము అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని, లేని పక్షంలో తాము సభ నుంచి వాకౌట్ అవుతామని హెచ్చరించారు.
దీంతో హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బొత్సకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాళ్లు చేసిన దౌర్భాగ్యాలు, వాస్తవాలు సభలో వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా దమ్ముంటే బొత్స నిల్చోవాలని, ఆయన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు(Legislative Council Chaiman Koyye Moshenu Raju ) సీరియస్ అయ్యారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దమ్ము, ధైర్యం అని మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు హోంమంత్రి అనిత వెంటనే క్షమించాలని వేడుకోవడంతో చైర్మన్ శాంతించారు. మిగిలిన సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పించారు.
క్షమించండి.. చైర్మన్‌ను వేడుకున్న హోంమంత్రి అనిత pic.twitter.com/ENds5dMFPP
— vemula srinuprasad ( Chief SubEditor) DISHA DAILY (@srinuprasad1234) November 18, 2024