- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తాటి కామెంట్స్ పై రేగా రెస్పాండ్..
దిశ,దమ్మపేట: మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆదివారం చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వాట్సాప్ ద్వారా స్పందించారు. ఆదివారం దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు స్వగృహంలో ఆయన రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం పాఠకులకు విధితమే, దీనిపై జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పందిస్తూ పార్టీలో ఉండటం ఇష్టం లేనివారు పార్టీ పైన ఏదో ఒక నిందలు మోపి బయటకు వెళ్తారని, తాటి వెంకటేశ్వర్లు చేసిన కామెంట్స్ వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదని, తన కోపమే తన శత్రువు గా మారుతుందని తన మనసులో అంతరంగీకరమైన ఆలోచన మనసులో వేరే ఉంచుకొని మాట్లాడుతున్నారని అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అన్ని విషయాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో త్వరలో మాట్లాడుతానని తెలిపారు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఇలా బహిరంగంగా పార్టీని, నాయకులపైన ఆరోపణలు, దూషణలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని మళ్లీ రాబోయే రోజుల్లో తీసుకునే ప్రసక్తే లేదని, ఎవరైనా పార్టీ క్రమశిక్షణ లైన్ దాటితే అధిష్టానంతో మాట్లాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీలో కేవలం కేసీఆర్ బాట మాత్రమే ఉంటుందని, రెండో బాటకు తావు లేదని, త్వరలో దమ్మపేట మళ్ళీ వచ్చి సీనియర్ నాయకులతో మాట్లాడి, స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పని చేసేందుకు ప్రతి కార్యకర్తతో మాట్లాడతానని ఎవరు అధైర్య పడొద్దని పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.