- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Britain Royal Palace: బ్రిటన్ రాజభవనంలో దొంగతనం..సెక్యురిటీ కళ్లుగప్పి ముసుగు దొంగల చోరీ
దిశ, డైనమిక్ బ్యూరో: సామాన్యుల దగ్గర దొంగతనం చేస్తే ఏం మజా వస్తుందనుకున్నారో ఏమో కానీ ఓ ఇద్దరు దొంగలు ఏకంగా రాజు నివాసానికే ఎసరు పెట్టారు. బ్రిటన్ రాజు ప్రిన్స్ ఛార్లెస్ (britain prince charles) కుటుంబానికి చెందిన విండ్సర్ ప్యాలెస్ (Windsor Castle) లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఉంటే రాజ కుటుంబానికి చెందిన భవనంలో చోరీ జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత నెలలో జరిగిన ఈ దొంగతనానికి సంబంధించిన వివరాలు తాజాగా అంతర్జాతీయ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కథనాల ప్రకారం గత నెలలో ఇద్దరు ముసుగు ధరించిన దొంగలు ఫెన్సింగ్ దూకి ఎస్టేట్ లోకి చొరబడ్డారు. క్యాజిల్ సెక్యూరిటీ జోన్ లో ఉండే ఓ ఫామ్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పిక్ అప్ ట్రక్కు, క్వాడ్ బైక్ ను దొంగిలించారు. చోరీ చేసిన ట్రక్కుతో గేటును ఢీ కొట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన సమయంలో రాజదంపతులు ఆ క్యాజిల్ లో లేరని తెలుస్తోంది. అయితే ప్రిన్స్ ఛార్లెస్ దంపతులు వారంలో రెండు రోజులు విండ్సర్ ప్యాలెస్ లోనే గడుపుతుంటారు. ఈ భవనానికి కేవలం 5 నిమిషాల నడక దూరంలో యువరాజ్ ప్రిన్స్ విలియమ్ దంపతుల నివాసం అడిలైడ్ కాటేజీ ఉంది. అటువంటి అత్యంత కీలకమైన విండ్సర్ క్యాజిల్ ఎస్టేట్ లోకి దుండగులు చొరబడి దోచుకుని పారిపోయే వరకు ఎలాంటి అలర్ట్ రాకపోవడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై యూకే భద్రతా అధికారులు దర్యాప్తు చేపట్టారు.