Lagcherla : లగచర్ల ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్‌కు కాంగ్రెస్ వినతి

by Ramesh N |
Lagcherla : లగచర్ల ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్‌కు కాంగ్రెస్ వినతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్మా కంపెనీ భూసేకరణ సంబంధించి (Lagcherla incident) లగచర్ల దాడి విషయంలో బీఆర్ఎస్, బీజేపీ, ప్రజాసంఘాలు (National st Commission) జాతీయ ఎస్టీ కమిషన్‌‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక పరమాణం చోటు చేసుకుంది. ల‌గ‌చ‌ర్ల‌లో గిరిజన ప్రజలపై జరిగిన ఘటనపై ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ జాతీయ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే రాంచందర్ నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్ తదితరులు సోమవారం ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్‌ను కలిసి దాడిపై వివరించారు.

బీఆర్ఎస్ (BRS) నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్ ఆరోపించారు. రైతుల స‌మ‌స్య‌లు వినడానికి, సమస్య ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌భుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, నేడు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ బృందం పర్యటించనుంది. గిరిజనులపైన దాడి వివరాలు కమిషన్ తెలుసుకోనుంది. లగచర్ల నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్లి రైతులతో ముఖాముఖిలో కూడా పాల్గొననున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed