- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi: ప్రాణాలు పోయినా మా భూములివ్వం.. ఎన్‌హెచ్‌ఆర్సీలో లగచర్ల బాధితులు ఫిర్యాదు
దిశ, వెబ్‌డెస్క్: లగచర్ల (Lagacharla) ఘటన వ్యవహారం హస్తినకు చేరింది. ఇవాళ నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), జాతీయ మహిళా కమిషన్ (NCW)ను లగచర్ల బాధిత రైతుల కలిసి కలిసి తమపై రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ (Telangana) పోలీసులు చేసిన దాడులు, అక్రమ అరెస్టులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీకి తమ భూములు ఇచ్చేది లేదని 9 నెలలుగా ధర్నాలు చేస్తున్నామని తెలిపారు. తాము ధర్నాలు చేసినప్పుడు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, కలెక్టర్ సహా ఏ అధికారి రాలేదన్నారు. కానీ ఘటన జరిగిన రోజు కలెక్టర్ సాధారణ దుస్తుల్లో పోలీస్ సెక్యురిటీ లేకుండా వచ్చారని తెలిపారు.
దీంతో కొంతమంది పిల్లలు తెలియకుండా దాడి చేశారని పేర్కొన్నారు. ఆ దాడిని సాకుగా చూపి అర్థరాత్రి రాత్రి 500 మంది పోలీసులు వచ్చి, కరెంట్ బంద్ చేసి తనపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. గొంతు పట్టి, కళ్లకు గంతలు కట్టి ఇష్టానుసారం బూతులు తిడుతూ కొట్టారన ఆరోపించారు. గ్రామంలో మగవాళ్లందరనీ అరెస్ట్ చేశారని అందులో కొందరు ఊరు వదిలి పారిపోయారని తెలిపారు. తమ భూములు ఇవ్వమని చెబుతున్నా.. వారి వదలట్లేదని వాపోయారు. భూమి తీసుకుంటే తాము ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు పోలీసులు వచ్చి ఏం చేస్తారోనని.. ఇంట్లో ఉండాలంటేనే భయంగా ఉందన్నారు. తమ ఇళ్లలోని మగవాళ్లందరినీ తీసుకెళ్లారని.. వారంతా ఎక్కడున్నారో తెలియదని అన్నారు. తమ ప్రాణాలు పోయినా సరే.. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు.
గిరిజనులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు.. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజనులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూములను ఆధారంగా చేసుకుని బతుకుతున్న వారి జీవనాధారాన్ని గుంజుకునే ప్రయత్నం చేశారని అన్నారు. 9 నెలలుగా తమ భూములు ఇవ్వమని రైతులు చెబూతునే ఉన్నారని.. భూములు తీసుకుంటామంటే ఆవేశంలో కొంతమంది దాడి చేశారని పేర్కొన్నారు. దాన్ని సాకుగా చూపి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. అర్థరాత్రి కరెంట్ తీసేసి, ఇంటర్‌నెట్ బంద్ చేసి మహిళలను హింసించారని ఆరోపించారు. 51 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టాదరని.. ఊళ్లో ఉన్న మగవాళ్లంతా గ్రామం విడిచి పారిపోయారని అన్నారు.
ప్రభుత్వం మళ్లీ ఏం చేస్తుందోనని గ్రామస్తులు భయపడుతున్నారని పేర్కొన్నారు. తమకు అండగా ఉండాలని రైతులు అన్ని పార్టీల నాయకులను కోరారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి కూడా లగచర్ల వాసులకు అండగా ఉంటుందన్నారు. ఇప్పుడు కూడా పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇంకా అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సోదరుడు బాధితులకు ఉరి శిక్ష పడుతుందని బెదిరిస్తున్నాడని, వారి భూములు గుంజుకుంటామని బెదిరింపులకు గురి చేస్తు్న్నాడని ఆరోపించారు. ఢిల్లీలో మాత్రమే న్యాయం జరుగుతుందని భావించి బాధితులంతా ఇక్కడకు వచ్చారని తెలిపారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌ను కలిసి పోలీసులు చేసిన అఘాయిత్యాలపై వివరించామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళ కమిషన్‌ను కూడా కలుస్తా్మని సత్యవతి రాథోడ్ తెలిపారు.