- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లావుగా ఉన్నావంటూ కానిస్టేబుల్ టార్చర్
దిశ,వెబ్ డెస్క్ : తన ఇష్ట ఇష్టాలను పట్టించుకోకుండా మానసికంగా శారీరకంగా స్త్రీ పడే బాధని ఎవరూ అర్థం చేకోరు. ఇలా ఎంతో మంది మహిళలు గృహహింసకు గురవుతున్నారు. ఇవేకాకుండా వివక్షతో కూడిన ఆచార సంప్రదాయాలు ,పద్ధతులు గృహహింసకు దారితీస్తున్నాయి. అలా తాళి అనే బంధంలో గమ్యం తెలియని నావలో ప్రయాణం చేస్తూ అలసిపోయిన అతివలెందరో.
ఇలా గృహహింస వేధింపులకు గురైన మహిళలకు, యువతులకు పోలీసు శాఖ అండగా ఉంటుంది. ఎటువంటి సమయంలోనైనా మహిళలకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ అండగా ఉండాల్సీన పోలీసే భార్యని హింసిస్తే…ఇలాంటి ఘటనే దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తన భార్యలావుగా ఉందని కానిస్టేబుల్ రోజుతనని వేధించడం మొదలు పెట్టాడు. ఆ వేధింపులు తట్టుకోలేని మహిళ బుధవారం ఆత్యహత్య చేసుకుంది.
వివరాల ప్రకారం..కానిస్టేబుల్ శివ కుమార్ తో శీలతకు వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే శ్రీలత లావుగా ఉందనే తన భర్త వేధిస్తున్నాడని శ్రీలత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.