అంపైర్లకు కూడా ఫామ్ ఉంటుంది : నితిన్ మీనన్

by Shiva |   ( Updated:2021-04-03 11:30:16.0  )
అంపైర్లకు కూడా ఫామ్ ఉంటుంది : నితిన్ మీనన్
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్‌లో ఆటగాళ్లకే కాకుండా అంపైర్లకు కూడా ఫామ్ ఉంటుందని ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్ నితిన్ మీనన్ అన్నాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్‌కు ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన నితిన్ మీనన్ నిర్ణయాలకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. చాలా కచ్చితత్వంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటాడని నితిన్ మీనన్‌కు పేరున్నది. గత ఏడాది జూన్‌లోనే ఐసీసీ ఎలైట్ అంపైర్‌గా ఎంపికైనా.. కరోనా కారణంగా మ్యాచ్‌లు లేకపోవడంతో ఇంత కాలం వేచి చూడాల్సి వచ్చింది.

తాజాగా ఒక వార్తా సంస్థతో మాట్లాడిన నితిన్ పలు విషయాలు వెల్లడించాడు. ‘ఐసీసీ ర్యాంకుల్లో టాప్ పొజిషన్‌లో ఉన్న ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన సిరీస్‌కు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించడం సంతోషం కలిగించింది. గతంలో దేశవాళీ, ఐపీఎల్‌కు అంపైర్‌గా నిర్వర్తించిన అనుభవం పనికి వచ్చింది. ఆటగాళ్ల మాదిరిగానే అంపైర్లకు కూడా ఫామ్ ఉంటుంది. ప్రస్తుతం నేను మంచి ఫామ్‌లో ఉన్నట్లు భావిస్తున్నా’ అని నితిన్ మీనన్ అన్నాడు.

Advertisement

Next Story