- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
12-15 ఏళ్ల పిల్లల కోసం ఫైజర్ టీకాకు యూకే ఓకే
లండన్: బ్రిటన్ మెడిసిన్స్ రెగ్యులేటర్ కౌమార దశపిల్లలకు పంపిణీ చేయడానికి ఫైజర్ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కఠిన సమీక్షలు చేసిన తర్వాత పిల్లలకు సురక్షితమని తేలిందని పేర్కొంది. 12 నుంచి 15 ఏళ్ల పిల్లల్లో ఈ టీకా ప్రయోగాలు చేశామని, ట్రయల్స్ ఫలితాల్లో ఫైజర్ టీకా సమర్థత, సురక్షణ, నాణ్యత నిర్దేశిత ప్రమాణాలను అందుకున్నాయని మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ(ఎంహెచ్ఆర్ఏ) వెల్లడించింది. 12 నుంచి 15ఏళ్ల పిల్లలకు ఈ టీకా పంపిణీ చేయడమే తరువాయి అని, దీనిపై ప్రభుత్వ ప్యానెల్ నిర్ణయం తీసుకుంటుందని వివరించింది. నిర్దేశిత ప్రమాణాలను అందుకోకుంటే నిస్సంకోచంగా తిరస్కరించేవారిమని ఎంహెచ్‌ఆర్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూన్ రైనె తెలిపారు. దీంతో పిల్లలకు ఫైజర్ టీకా వేయడానికి అనుమతించిన అమెరికా, ఐరోపా సమాఖ్యల తర్వాత తాజాగా ఆ జాబితాలో యూకే చేరినట్టయింది. ఇంగ్లాండ్‌లో దాదాపు సగం మంది వయోజనులు రెండు డోసుల టీకా పొందగా, మూడోంతులకు పైగా మంది సింగిల్ డోసు తీసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది.