బోధనాస్పత్రుల వైద్యులకు యూజీసీ వేతనాలు

by Shyam |
బోధనాస్పత్రుల వైద్యులకు యూజీసీ వేతనాలు
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్:బోధనాస్పత్రులలో పని చేసే వైద్యులకు యూజీసీ వేతనాలు వెంటనే వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు డాక్టర్ పల్లం ప్రవీణ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని టీచింగ్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న వైద్యులకు సవరించిన వేతనాలను ఇస్తున్నట్లు పది రోజుల క్రితం సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి ఫైలుపై సంతకం చేసినప్పటికీ నేటికీ అమలు కాలేదన్నారు. ఈ విషయంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం ఆదేశాల అమలు కోసం రాష్ట్రంలోని సుమారు 4,500 మంది వైద్యులు ఎదురు చూస్తున్నారని అన్నారు. జూలై 31వ తేదీ లోగా ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేస్తూ డాక్టర్లకు యూజీసీ వేతనాలు వర్తింపజేయాలని డాక్టర్ ప్రవీణ్ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.

Advertisement

Next Story