ఆన్‌లైన్ క్లాసుల కోసం యూజీసీ నివేదిక

by Shamantha N |
ఆన్‌లైన్ క్లాసుల కోసం యూజీసీ నివేదిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులతో పాటు ఆన్‌లైన్ తరగతులను కూడా నిర్వహించేందుకు యూవర్సిటీ గ్రాంట్ కమీషన్ న్యూ ఢిల్లీ (యూజీసీ) నివేదికను తయారు చేసింది. సాంకేతిక పరిజ్ణానాన్ని వినియోగించుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు నూతన ప్రక్రియలను అవలంభించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడింది. ఇందుకు సంబంధిచి పూర్తి వివరాలతో నివేధికను తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాధనలందించారు. యూజీసీ సూచించిన అంశాలపై సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలించనుంది. ఆన్ లైన్ పద్దతిలో డిజిటల్ లర్నింగ్ ద్వారా క్లౌడ్-బేస్డ్ లెర్నింగ్ ను, వీడియో ఉపాన్యాసాలను, పాడ్‌కాస్ట్‌లు, రికార్డింగ్‌లను విద్యార్థులకు అందించవచ్చని యూజిసీ పేర్కొనింది. ఈ పద్దతుల వలన విద్యార్థుల, ఉపాధ్యాయలు సమయాన్ని ఆదా చేయడంతోపాటు, కొత్త కొత్త టెక్నాలజీకి విద్యార్థులకు అలవాటు చేయడం జరుగుతుందన్నారు. తరగతులు, సబ్జెక్టుల వారిగా ఆన్ లైన్ తరుగతులను. ఆఫ్ లైన్ తరగతుల సంఖ్యను నిర్ణయిస్తామని తెలిపారు. అభివృద్ధి చెందిన యూఎస్ఏ, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ వంటి దేశాల్లో ఆన్ లైన్ ద్వారా డిజిటల్ విద్యను అందిస్తున్నాయని వివరించారు. విదేశాల్లోని తరగతులకు సంబంధించిన లింక్‌లను నివేదికలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed