సెప్టెంబర్ నాటికి యూజీ, పీజీ పరీక్షలు

by srinivas |
సెప్టెంబర్ నాటికి యూజీ, పీజీ పరీక్షలు
X

దిశ ఏపీ బ్యూరో: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని 20 యూనివర్సిటీల పరిధిలో యూజీ, పీజీ పరీక్షలు సెప్టెంబర్‌లోపు నిర్వహించనున్నామని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌తో పాటు రెగ్యులర్ ఎడ్యుకేషన్ కూడా అవసరమేనని ఆయన చెప్పారు. కరోనా నేపథ్యంలో విద్యాసంవత్సరం వ్యవధి కుచించుకుపోవడంతో అకడమిక్‌ కరిక్యులమ్‌ రీ డిజైన్‌ చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది నుంచి డిగ్రీ మూడేళ్లలో 10 నెలల పాటు ఇంటర్న్‌‌షిప్‌ను తప్పనిసరి చేస్తున్నామని ప్రకటించారు. సెప్టెంబర్‌ 13 నుంచి 27 మధ్యలో ఎంసెట్‌ పరీక్షతో పాటు ఇతర పరీక్షలు కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కరోనా కారణంగా చివరి సంవత్సరం డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ వచ్చిన వారికి, అబ్రాడ్‌ వెళ్లిన వారికి ముందస్తుగా డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story