ఆస్థి‌పై కన్నేసిన ఒకరు.. అప్పు ఎగ్గొట్టేందుకు మరోకరు.. వృద్ధురాలిని ఏం చేశారంటే..

by  |   ( Updated:2021-12-22 11:32:25.0  )
ఆస్థి‌పై కన్నేసిన ఒకరు.. అప్పు ఎగ్గొట్టేందుకు మరోకరు.. వృద్ధురాలిని ఏం చేశారంటే..
X

దిశ, అలంపూర్: కంటికి రెప్పలా కాపాడాల్సిన సోదరి కుమారుడు మరో తాగుబోతు తో జతకట్టి వృద్ధురాలు దారుణంగా హత్య చేసిన సంఘటన అలంపూర్ మండలం కాశీపురం గ్రామంలో మూడు రోజుల క్రితం చోటుచేసుకుంది. అలంపూర్ పోలీసులు హత్య కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం సాయంత్రం వెల్లడించారు. కాశీపురం గ్రామం కు చెందిన ఒంటరి వృద్ధురాలు మోదిన్ భీ (56) గత ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో తన వ్యవసాయ పోలంకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన గోళ్ళ వెంకట్ రాముడు పొలంలో పత్తి ఎరుతున్న వృద్దురాలిపై కర్ర తో దాడికి పాల్పడ్డాడు. అనంతరం వృద్దురాలి మెడకు చీర కొంగుతో బిగించి చంపేశాడు.

మోదీన్ భీ సోదరి కుమారుడైన పింజరి శాలు, గోళ్ల వెంకట రాముడు స్నేహితులు తరుచుగా గ్రామంలో మద్యం సేవించేవారు. పింజరి శాలు.. మోదీన్ భీకి వున్న మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి మీద కన్ను పడింది. గోళ్ల వెంకట రాముడు మోదీన్ భీ వద్ద 80 వేల రూపాయల అప్పు చేసి తీర్చలేదు. వృద్ధురాలిని హత్య చేస్తే నాకు అస్థి దక్కుతుందని శాలు. అప్పు ఎగిరిపోతుందని వెంకట రాముడు పన్నాగం వెసి మోదిన్ భీ ని చంపేశారు. అలంపూర్ పోలీసులు మూడు రోజుల్లో హత్య కేసు చేదించారు.

Advertisement

Next Story