- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెల్ఫీ సరదా.. మరో ఇద్దరు యువకులు బలి..
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామాంజరం ప్రాంత సరిహద్దున ఉన్న గోదావరి నదిలో జారీ పడి ఇద్దరు యువకుల ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం.. ఆకుల సందీప్(20), కేతన్ మణి కుమార్‌లు(20) ఆదివారం సాయంత్రం రామాంజరం ప్రాంతంలోని గోదావరి అందాలను చూసేందుకు వెళ్లారు. అయితే నది ఒడ్డుకు దిగి సెల్ఫీలు తీసుకోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో వీరు గోదావరిలోకి దిగారని సమాచారం. దీంతో నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో ఇద్దరు జారీ నదిలో పడిపోయారు. కొద్ది సేపటికే సందీప్ చేపల వలకు చిక్కుకొని శవమై తేలాడు. ఇది గమనించిన స్థానికులు సందీప్‌ను ఒడ్డు మీదకు తీసుకు వచ్చారు. అనంతరం కేతన్ మణి కుమార్ కోసం గజ ఈతగాళ్ళు గాలింపు చేపట్టారు. అతని ఆచూకీ లభించలేదు.
చీకటిపడటంతో గాలింపు చర్యలను రేపటికి వాయిదా వేశారు. ఈ క్రమంలో స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటుగా వెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు విషయం తెలియడంతో వచ్చి సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటానని హామి ఇచ్చారు.