- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ద్విచక్ర వాహన దొంగల ముఠా అరెస్ట్
దిశ, జనగామ:
ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు ఇన్‌చార్జీ సీఐ సంతోష్ తెలిపారు. శుక్రవారం జనగామ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఠా వివరాలు వెల్లడించారు. జిల్లాకు చెందిన కే.నాగరాజు, బి.నరేష్, ఎన్.ప్రతాప్, జె.సతీష్, బి.విజయ్ చంద్ర, జి.రోహిత్, ఎవెన్, జి.మనోజ్ జల్సాలకు అలవాటుపడి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరంతా హైదరాబాద్, కరీంనగర్, యాదాద్రి జిల్లాలో తొమ్మిది బైక్‌లు దొంగిలించారు. గురువారం సాయంత్రం ఎస్‌ఐ రాజేష్ నాయక్, సిబ్బందితో వడ్లకొండ బైపాస్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా కొంతమంది వ్యక్తులు పారిపోయారు. వారిని వెంబడించిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. జల్సాలకు అలవాటుపడి వాహనాలు దొంగిలిస్తున్నట్టు అంగీకరించారు. నిందితుల నుంచి తొమ్మిది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరు పరచనున్నట్టు సీఐ తెలిపారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రాజేష్ నాయక్ సహా సిబ్బందిని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్ అభినందించారు.