ఈ నెల 30 నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ700 డెలివరీలు

by Harish |
car21
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా తన ఎస్‌యూవీ మోడల్ ఎక్స్‌యూవీ700 కోసం భారీగా బుకింగ్స్ నమోదయ్యాయని వెల్లడించింది. ఈ నెల 7న బుకింగ్స్ ప్రారంభించిన తర్వాత రెండు వారాల్లోనే ఇప్పటివరకు 65,000 బుకింగ్స్ వచ్చాయని కంపెనీ తెలిపింది. ఇందులో బుకింగ్ ప్రారంభించిన మొదటి రోజు తొలి గంటలోనే 25,000 బుకింగ్స్ వచ్చాయి. ఆ తర్వాతి రోజు కేవలం 2 గంటల్లో మరో 25,000 బుకింగ్‌లు వచ్చాయి. బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు పెట్రోల్ వేరియంట్ వాహనాలను ఈ నెల 30 నుంచి, డీజిటల్ వేరియంట్ ఎంపిక చేసిన వారికి నవంబర్ మొదటి వారం నుంచి డెలివరీ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. బుకింగ్స్ ప్రస్తుతం అందరికీ అందుబాటులోనే ఉన్నాయని, ఆన్‌లైన్, డీలర్‌షిప్‌ల నుంచి బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. కాగా, మహీంద్రా సంస్థ ఎక్స్‌యూవీ700 మోడల్‌ను ఎంఎక్స్, ఏఎక్స్ పేరుతో రెండు సిరీస్‌లలో విడుదల చేసింది. అలాగే, 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో ఇది లభిస్తోంది. ఈ మోడల్ ధర రూ. 19.19 లక్షల(ఎక్స్‌షోరూమ్) వద్ద ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story