- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టోక్యో ఒలంపిక్స్‌కు స్పాన్సరర్ల దెబ్బ
దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ ప్రభావంతో ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలంపిక్స్‌కు మరో సమస్య ఎదురైంది. ప్రస్తుతం ఒలంపిక్స్‌కు స్పాన్సరర్లుగా ఉన్న కంపెనీల్లో మూడింట రెండో వంతు సంస్థలు తమ భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. జపాన్ ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ ‘ఎన్‌హెచ్‌కే’ జరిపిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇప్పటికే ఒలంపిక్స్‌పై చాలా నిధులు ఖర్చు చేశామని.. కరోనా కారణంగా తమ కంపెనీలు కూడా ఆదాయాన్ని కోల్పోయిన సమయంలో మరో ఏడాది పాటు భాగస్వామ్యాన్ని కొనసాగించలేమని స్పష్టం చేశాయి. ఇప్పటికే జపాన్‌లో చాలా సంస్థలు యాడ్స్ ఇవ్వడం తగ్గించాయి. 2021లో అయినా ఒలంపిక్స్ జరుగుతాయో లేదో అనే సందిగ్ధత నెలకొన్న సమయంలో అనవసరంగా వ్యాపార భాగస్వామ్యాన్ని పొడిగించడం నష్టదాయకమేనని ఒక కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఒలంపిక్స్, పారాఒలంపిక్స్‌కు 78 మంది అఫీషియల్ స్పాన్సరర్లు ఉన్నారు. వీరిలో 57.68 శాతం సంస్థలు ఇప్పటికే కరోనా నష్టాల్లో ఉన్నాయి. అలాంటి సమయంలో స్పాన్సరర్లుగా అదనపు భారాన్ని మోసే స్థితిలో లేమని చెప్పినట్లు ఆ సర్వే స్పష్టం చేసింది.