రెండు బైకులు ఢీ కొని ఇద్దరు మృతి

by Sumithra |   ( Updated:2020-05-18 09:56:16.0  )
రెండు బైకులు ఢీ కొని ఇద్దరు మృతి
X

దిశ, మెదక్: రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటన్ చేరు మండలం కర్దనూర్ గ్రామ సమీపంలో జరిగింది. ఈ సంఘటనలో బైక్‌ల‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు గమనించి ఆసుపత్రి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఇద్దరూ మృతిచెందారు. వీరిలో ఒకరు బీడీఎల్ పరిశ్రమ కార్మికుడు భూపాలన్, మరో వ్యక్తి కొండకల్ గ్రామానికి చెందిన అశోక్‌గా గుర్తించారు.

Advertisement

Next Story