- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరెంట్ షాక్ : నీరు పెడుతూ ఒకరు, విద్యుత్ తీగ తగిలి మరొకరు
దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలం ఎర్రబెల్లి గూడెంలో విద్యుత్ తీగ తెగిపడి ప్రమాదవశాత్తు ఓ మహిళా మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన శివరాత్రి నాగమ్మ (25) ఇంట్లో తరుచుగా విద్యుత్ సరఫరా అవుతూ మంటలు వస్తుండేవి. ఈ క్రమంలోనే ఆమె ఇంట్లో నుండి బయటకు వస్తున్న తరుణంలో ఆమె ఇంట్లోకి కనెక్షన్ ఇచ్చిన సర్వీస్ వైర్ తెగి మీద పడటంతో ఎడమ చేతికి గాయాలై అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లి బుచ్చమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నెల్లికుదురు ఎస్సై జితేందర్ తెలిపారు.
కొత్తగూడలో..
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీ నగర్‌లో ఎర్రకుంట నుండి మోటార్ సాయంతో నారు మడికి నీరు పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గుగులోత్ కునియా(37) అనే రైతు మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తగూడ ఎస్సై సురేష్ నాయక్ తెలిపారు.