- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రీవెంజ్ ప్లాన్.. అర్థరాత్రి కాపు కాసి ఇనుపరాడ్డుతో దాడి..
దిశ, ఖమ్మం రూరల్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలోని ఆరెకోడు గ్రామంలో దుర్గామాత విగ్రహ నిమజ్జనం వద్ద శనివారం రాత్రి పలువురు గొడవకు దిగి కొట్టుకున్నారు. బాధితుడు సిలివేరు రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నిన్న రాత్రి ఆరెకోడు గ్రామంలో దుర్గా మాత నిమజ్జనం జరిగింది. ఈ క్రమంలో గునగంటి గాంధీ అనే ఆటో డ్రైవర్ తన ఆటోను వేగంగా నడుపుతూ నిమజ్జనంలో ఉన్న జనాలపైకి పోనిచ్చాడు.
ఈ ఘటనలో గుర్రం సంగయ్య అనే వ్యక్తికి తగలి వీపుకు గాయమైంది. ఇదే విషయమై రామారావుతో పాటు పలువురు గ్రామస్తులు కలిసి గునగంటి గాంధీని నిలదీశారు. ఈ విషయాన్ని మనసులో పెట్టకుని గాంధీ శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో గ్రామ సర్పంచ్ ఉప్పగండ్ల వెంకటనారాయణ, రామారావు మరికొంత దుర్గామాత నిమజ్జనం ముగించుకుని ఇంటికి వెళుతుండగా అదే గ్రామానికి చెందిన గునగంటి గాంధీ, గునగంటి విజయ్, సిలివేరు సత్యనారాయణ గ్రామంలోని వాటర్ ట్యాంక్ వద్ద కాపు కాసి ఇనుప రాడ్డుతో రామారావుపై దాడి చేయగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.