గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు అరెస్టు.. ఎక్కడంటే?

by Sridhar Babu |
గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు అరెస్టు.. ఎక్కడంటే?
X

దిశ, జగిత్యాల : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ రవాణా విక్రయదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు గంజాయి సరఫరా, విక్రయాలపై నిఘా పెంచారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేక పోలీసులను అనుమానిత ప్రాంతాల వద్ద నిఘా పెట్టారు.పట్టణంలో గంజాయి సప్లై చేస్తున్న బిట్ బజార్ కు చెందిన అరుముళ్ల సాయికుమార్, ఆసిఫాబాద్ జిల్లా లింగపూర్ గ్రామానికి చెందిన మాడారి చందు అనే ఇద్దరు వ్యక్తులను జగిత్యాల పట్టణ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ప్రకాశ్ మాట్లాడుతూ.. జగిత్యాలకు చెందిన ఆరుముళ్ళ సాయికుమార్‌తో పాటు గంజాయి సాగు చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్కు చెందిన మాడారి చందులను అరెస్టు చేసి మొక్కలను స్వాధీనం చేసుకున్నామన్నారు. గత నెలలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా మేకల రాజు గంజాయితో పట్టుబడ్డాడని.. అతన్ని విచారించి రిమాండ్‌కు తరలించామన్నారు. రాజు ఇచ్చిన సమాచారం మేరకు ఆరుముళ్ళ సాయి, చందులను అదుపులోకి తీసుకున్నమన్నారు.

చందు గంజాయి సాగు చేస్తూనే జిల్లాలోని యువకులకు సప్లై చేస్తున్నాడని తెలియడంతో మొక్కలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని రిమాండ్ తరలించామని డీఎస్పీ ప్రకాష్ తెలిపారు. చందు అనే యువకుడు గంజాయి విక్రయించడంతో పాటు పలు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని, అతని ఇంటి వద్ద నుంచి మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో టౌన్ సీఐ కిషోర్, ఎస్ఐ నారాయణ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story