భారత్‌లో ఇద్దరికి కోవిడ్-19 పాజిటివ్..

by sudharani |
భారత్‌లో ఇద్దరికి కోవిడ్-19 పాజిటివ్..
X

దిశ, హైదరాబాద్
ప్రపంచాన్నివణికిస్తున్న కోవిడ్-19(కరోనా)వైరస్ ఇప్పడు ఇండియాను తాకింది. మొట్టమొదటి సారిగా దేశరాజధాని ఢిల్లీలో ఒకటి, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో మరో కేసు నమోదు అయినట్టు వైద్యులు అధికారికంగా వెల్లడించారు.సోమవారం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అలాగే ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించగా, పరీక్షల అనంతరం అతనికి కూడా పాజిటివ్ వచ్చినట్టు ఢిల్లీ వైద్యులు వెల్లడించారు. కాగా, ఎక్కడివారిని అక్కడే ఐసోలేషన్ సెంటర్లలో ఉంచి వైద్యం అందిస్తుండగా, వారి ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు తెలుస్తోంది.

tags ; covid-19, two cases positive, in india,one hyd, one delhi

Advertisement

Next Story