ఇద్ద‌రు కాంట్రాక్టు వైద్యుల రాజీనామా

by Sumithra |
ఇద్ద‌రు కాంట్రాక్టు వైద్యుల రాజీనామా
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాచ‌లం డిప్యూటీ డీఎంఅండ్ హెచ్‌వో న‌రేష్‌కుమార్ క‌రోనాతో మృతి చెంద‌డంతో జిల్లా వైద్యుల్లో భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఏకంగా ఉద్యోగాల‌ను సైతం వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌ప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. భ‌ద్రాచ‌లం ఏరియా ఆస్ప‌త్రిలో కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో ప‌నిచేస్తున్న ఇద్ద‌రు వైద్యులు రాజీనామా చేసిన‌ట్లు స‌మాచారం అందుతోంది. అయితే ఈ రాజీనామాల‌ను డీఎంఅండ్‌హెచ్‌వో భాస్క‌ర్‌నాయ‌క్ ఆమోదించాల్సి ఉందని వైద్య వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

Next Story