కంగనా, పూజ ట్వీట్ వార్..

by Anukaran |   ( Updated:2020-07-09 05:51:29.0  )
కంగనా, పూజ ట్వీట్ వార్..
X

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, డైరెక్టర్ కమ్ నటి పూజ భట్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. సుశాంత్ సింగ్ మరణానికి కారణం నెపోటిజం అని.. మహేశ్ భట్ బయట నుంచి వచ్చిన వ్యక్తులను ఎదగనివ్వడని ఆరోపించింది కంగనా. దీనిపై స్పందించిన పూజ.. కంగనాను లాంచ్ చేసిందే (విశేష్ ఫిల్మ్స్) మహేశ్ భట్ అని, తను ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంటున్నప్పుడు మహేశ్‌కు థ్యాంక్స్ చెప్పిన వీడియోను పోస్ట్ చేసింది. వీడియో అబద్దం చెప్పదు కదా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇలా చాలా మంది నటులను తన తండ్రి మహేశ్ లాంచ్ చేశాడని చెప్పింది. మహేశ్ భట్ కంగనాను లాంచ్ చేయకపోయి ఉంటే.. తాను స్టార్ హీరోయిన్ అయ్యేదా? అని ప్రశ్నించింది.

దీనిపై ఘాటుగా రిప్లై ఇచ్చింది కంగనా. ఫ్రీగా చేసే నటులకు మాత్రమే మీ నాన్న చాన్స్ ఇస్తాడని.. అలాగని వారి మీద చెప్పులు విసరాలని తనకు లైసెన్స్ ఏమీ ఇవ్వలేదని తెలిపింది. ఒక ఆర్టిస్ట్ పట్ల ఎలా నడుచుకోవాలో నేర్చుకొమ్మని నీ తండ్రికి చెప్పు అని సూచించింది. అంతేకాదు తన టాలెంట్‌ను గుర్తించింది డైరెక్టర్ అనురాగ్ బసు అని.. మహేశ్ భట్ కాదని చెప్పింది.

‘మహేశ్‌ను‌ మరో విషయం కూడా అడుగు.. అసలు సుశాంత్, రియా చక్రవర్తిల బంధంపై ఎందుకు డబ్బులు ఇన్వెస్ట్ చేశాడో? అయినా గ్యాంగ్‌స్టర్‌లో మహేశ్ భట్ చాన్స్ ఇవ్వడం వల్ల తను స్టార్ కాలేదు.. ఆ టైమ్‌లో పోకిరి మూవీకి కూడా ఆడిషన్ ఇచ్చాను.. పోకిరి బ్లాక్ బస్టర్ హిట్’ అని గుర్తుంచుకోవాలని చెప్పింది.

Advertisement

Next Story