ట్విట్టర్ కొత్త ఫీచర్ : కాపీ, పేస్ట్ లకు చెక్ 

by Anukaran |   ( Updated:2020-09-02 11:32:43.0  )
ట్విట్టర్ కొత్త ఫీచర్ : కాపీ, పేస్ట్ లకు చెక్ 
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ మైక్రో-బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నది. తన ప్లాట్‌ఫామ్ నుంచి కాపీ పేస్ట్ ట్వీట్‌లను హైడ్ చేయనున్నట్లు వెల్లడించింది. కాపీ పేస్ట్ ట్వీట్లు అంటే ఎలాంటి మార్పు లేకుండా ఇతరులు చేసిన ట్వీట్లను తమ అకౌంట్ లో కాపీ చేసి పేస్ట్ చేయడం. ఈ మధ్య కాలంలో యూజర్లు కాపీ పేస్ట్ ట్వీట్లు చేయడం ఎక్కువగా కనిపిస్తోంది.

దీంతో మల్టిపుల్ అకౌంట్స్ లో కాపీ, పేస్ట్ కంటెంట్ ట్వీట్ చేయబడుతున్నాయని ట్విట్టర్ తన ట్వీట్‌లో పేర్కొంది. దీనివలన ప్లాట్‌ఫామ్‌లో ఒకే పోస్ట్ రిపీట్ అవడంతో వ్యూవ్స్ తో పాటు లైక్స్ కూడా తగ్గుతున్నాయని. తాజాగా ట్విట్టర్ తన సెన్సార్ షిప్ విధానాన్ని అప్ డేట్ చేసింది. దీంతో ట్విట్టర్ మొబైల్ యాప్ లో ఒక ఫీచర్ ను కూడా ప్రవేశపెట్టింది.

ఈ ఫీచర్ ఓపెన్ చేసుకుంటే కాపీ పేస్ట్ పోస్టులు కనిపించవని ట్విట్టర్ పేర్కొంది. అంతేకాకుండా ట్విట్టర్ ‘రీట్వీట్ విత్ కోట్’ అనే ఫీచర్ ను కూడా అందుబాటులో తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ట్విటర్ లో పోస్ట్ చేసిన సమాచారానికి రీట్వీట్ చేయడానికి అవకాశం ఉంటుంది.

Advertisement

Next Story