- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్టోబర్‌లో ట్విట్టర్ ఎంగేజ్‌మెంట్స్ నివేదిక..
దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టీట్ అనే సోషల్ మీడియా అనాలిటిక్స్ సంస్థ అక్టోబర్ మాసానికి గాను ట్విట్టర్ ఎంగేజ్‌మెంట్స్ నివేదికను విడుదల చేసింది. 20 కేటగిరీల్లో రోజువారీగా, నెలవారీగా ఇలా ట్విట్టర్ ఎంగేజ్‌మెంట్స్ డేటాను విడుదల చేయడం ఇదే మొదటిసారి. రాజకీయనాయకులు (పార్టీల ప్రకారం), జర్నలిస్టులు, బిజినెస్ లీడర్లు, స్పోర్ట్స్ పర్సన్స్, మూవీ స్టార్‌లు, రచయితలు, షెఫ్‌లు, కమెడియన్‌లు ఇలా వివిధ కేటగిరీల్లో ఎక్కువ ఎంగేజ్‌మెంట్స్ ఉన్నవారి జాబితాను ప్రకటించింది. రాజకీయ నాయకుల్లో 72,15,913 ట్విట్టర్ ఎంగేజ్‌మెంట్‌లతో నరేంద్రమోడీ మొదటిస్థానంలో ఉన్నారు. బాలీవుడ్‌లో సోనూసూద్, బిజినెస్‌లో ఆనంద్ మహీంద్రా, క్రికెటర్‌లలో విరాట్ కొహ్లీ, జర్నలిస్ట్‌లలో దీపక్ చౌరాసియా, కమెడియన్‌లలో కునాల్ కమ్రా, రీజనల్ సినిమా స్టార్లలో మహేశ్ బాబు, రచయితల్లో ఆనంద్ రంగనాథన్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు.
ఈ మొదటి నివేదికలో సర్‌ప్రైజ్ ఏంటంటే… బిహార్ సీఎం నితీష్ కుమార్ కంటే తేజస్వీ యాదవ్‌కు ఎక్కువ ట్విట్టర్ ఎంగేజ్‌మెంట్స్ ఉన్నాయి. అలాగే మోడీ తర్వాత వరుస స్థానాల్లో రాహుల్ గాంధీ, యోగి ఆదిత్యనాథ్, ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. సోనూసూద్ కంటే పది రెట్లు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న షారుక్ ఖాన్ రెండో స్థానంలో ఉండటం గమనార్హం. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, రితేష్ దేశ్‌ముఖ్ ఉన్నారు. టాప్ 10 జాబితాలో హీరోయిన్ పూజా హెగ్డే ఉండటం మరో సర్‌ప్రైజ్. ఎంగేజ్‌మెంట్ అంటే ఇతర ట్వీట్లలో వీరికి వచ్చిన పాపులారిటీని బట్టి మారుతుంది. కాబట్టి కరోనా పాండమిక్ సమయంలో మానవతా దృక్పథాన్ని చూపించి, సోనూసూద్ టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిన సందర్భంగా ఆయనకు అధిక ఎంగేజ్‌మెంట్స్ వచ్చాయని సోషల్ మీడియా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.