చెత్త బండి రావడం లేదంటూ నిరసన..

by Sumithra |
చెత్త బండి రావడం లేదంటూ నిరసన..
X

దిశ, భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని 13వ వార్డు కాలనీవాసులు శనివారం వినూత్న నిరసన తెలిపారు. గత వారం రోజులుగా తమ కాలనీకి మున్సిపల్ చెత్త బండి రావడం లేదని మున్సిపల్ కార్యాలయం ఎదుట చెత్తను పోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెత్త బండి రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తమ కాలనీని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు చింతకింది కిరణ్, వనం సతీష్, సామల విజయ్, తడక క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed