Bangladeshi migrants: బంగ్లా వలస దారుల పిల్లలను గుర్తించండి : ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్

by Y. Venkata Narasimha Reddy |
Bangladeshi migrants: బంగ్లా వలస దారుల పిల్లలను గుర్తించండి : ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్
X

దిశ, వెబ్ డెస్క్ : దేశరాజధాని ఢిల్లీ(Delhi)లో వలసదారుల గుర్తింపు దిశగా ఢిల్లీ మున్సిపల్ కార్పేరేషన్(Municipal Corporation)కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లోని బంగ్లాదేశ్ కు చెందిన వలసదారుల పిల్లల(Cchildren of Bangladeshi Migrants)ను గుర్తించి వివరాలు సమర్పించాలని కార్పోరేషన్ ఆదేశించింది. వారికి జనన దృవీకరణ పత్రాలు జారీ కాని విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించింది. ఇప్పటికే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించాలని ఆదేశాలిచ్చారు. 60రోజుల్లో అక్రమ వలసదారులను గుర్తించి తరలించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పేర్కొన్నారు.

ఇటీవల బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలపై దాడుల నేపథ్యంలో దర్గా హజ్రల్ నిజాముద్ధిన్, బస్తీ హజ్రల్ నిజాముద్ధిన్ ముస్లీం కమ్యూనిటీలు ఢిల్లీలో బంగ్లా జాతీయులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ బంగ్లా వలసదారుల ఏరివేతకు ఆదేశాలిచ్చారు. ఈ దిశగా మున్సిపల్ కార్పేరేషన్ మరో ముందడుగు వేస్తూ వలసదారుల పిల్లలను గుర్తించాలంటూ ఆదేశాలిచ్చింది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వలసదారుల సమస్య అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీల మధ్య రాజకీయ ప్రచారాంశాలు కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed