Anasuya: మూడో బిడ్డని కనాలని ఉంది.. కానీ నా భర్త కోపరేట్ చేయట్లేడంటూ అనసూయ కామెంట్స్

by Hamsa |
Anasuya: మూడో బిడ్డని కనాలని ఉంది.. కానీ నా భర్త కోపరేట్ చేయట్లేడంటూ అనసూయ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ యాంకర్ అనసూయ(Anasuya) జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయి.. ఒకప్పుడు వరుస షోలు చేసి ప్రేక్షకులను అలరించింది. అలాగే పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాల్లో అవకాశం అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవల అనసూయ నటించిన మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule). ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

అయితే అనసూయ సినిమాలతో పాటు సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ మూడో బిడ్డను కనాలని ఉందని కామెంట్స్ చేసింది. ‘‘నాకు మూడో బిడ్డని కనాలని ఉంది. అది కూడా ఆడబిడ్డ పుట్టాలని కోరుకుంటున్నాను. కానీ మా ఆయన మాత్రం మూడో బిడ్డ ఎందుకు అని అంటున్నాడు. నీకేంటి కనేసి నీ సినిమా షూటింగ్స్‌(Movie shootings)కు, పనులకు వెళ్తావు అని అంటాడు. మూడో బిడ్డను కనడానికి నా భర్త కోపరేట్ చేయట్లేడు.

నాకు ఆడ బిడ్డ పుట్టకపోతే నేను వేస్ట్ అని, నా జీవితం వృథా అని అనిపిస్తుంది. ఇదే మాట మా పిల్లలకు కూడా చెప్పాను. అయితే మా చిన్న చిన్న కొడుకు నీకు బిడ్డ ఎందుకు పుడితే చంపేస్తా అని అన్నాడు. కూతురు ఉంటేనే బ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడే అబ్బాయిలకు ఎలా ఉండాలో తెలుస్తుంది. బిడ్డలు ఉంటేనే ఇళ్లు చక్కబడుతుంది. మనమే ఈ యూనివర్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంటాం. కాబట్టి నాకు ఆడబిడ్డ కావాలి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed