Rashmika Mandanna: క్షమించండి.. పొరపాటు అయిందంటూ రష్మిక షాకింగ్ కామెంట్స్.. దుమారం రేపుతున్న పోస్ట్

by Kavitha |   ( Updated:2024-12-21 05:40:14.0  )
Rashmika Mandanna: క్షమించండి.. పొరపాటు అయిందంటూ రష్మిక షాకింగ్ కామెంట్స్.. దుమారం రేపుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్‌గా ‘పుష్ప-2’(Pushpa-2) సినిమాతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ‘ది గర్ల్‌ఫ్రెండ్’(The Girl Friend), ‘ఛావా’(Chawa), ‘రెయిన్ బో’(Rainbow) సినిమాలతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ అక్కడ మాట్లాడుతూ.. తాను థియేటర్లలో చూసిన సినిమా కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ‘గిల్లి’(Gilli) అని తెలిపారు. అందుకే విజయ్ దళపతి(Vijay Dalapathi) అంటే తనకు అమితమైన ఇష్టమని చెప్పింది.

ఈ సందర్భంగా ‘గిల్లి’ మూవీ తెలుగు ‘పోకిరి’(Pokiri) సినిమాకు రీమేక్ అని రష్మిక పొరపాటు పడ్డారు. కానీ, ఆ మూవీ ‘ఒక్కడు’(Okkadu) కి రీమేక్ కావడంతో సరదాగా ఆటపట్టిస్తూ ఆమె ఇంటర్వ్యూ వీడియోను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై రష్మిక ‘ఎక్స్’(X) వేదికగా స్పందించింది. “అవును.. ఇంటర్వ్యూ అయిపోయాక గుర్తొచ్చింది. సారీ.. గిల్లి సినిమా ఒక్కడు రీమేక్ అని. పోకిరి మూవీని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. అప్పటికే సోషల్ మీడియాలో నాపై పోస్టులు వైరల్ అయ్యాయి. సారీ.. సారీ.. మై బ్యాడ్. కానీ నాకు వాళ్ళు నటించిన అన్ని సినిమాలు ఇష్టమే” అని తెలుగులో రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed