జగ్గారెడ్డి రాకుంటే సచ్చిపోతా.. కరెంట్ స్తంభం ఎక్కిన వ్యక్తి..

by Sumithra |   ( Updated:2024-12-21 05:21:33.0  )
జగ్గారెడ్డి రాకుంటే సచ్చిపోతా.. కరెంట్ స్తంభం ఎక్కిన వ్యక్తి..
X

దిశ, సంగారెడ్డి : జగ్గారెడ్డి రావాలి లేకుంటే స్తంభం నుంచి కిందకు దూకి చచ్చిపోతాను అంటూ ఓ వ్యక్తి 33/11 కేవీ విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. సంగారెడ్డిలోని రాజంపేటకు చెందిన చంద్రమౌళి పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ముందు గల విద్యుత్ స్తంభాన్ని ఎక్కాడు. జగ్గారెడ్డి వచ్చి తనతో మాట్లాడితేనే తాను కిందకు దిగుతానని లేదంటే స్తంభం నుంచి దూకి చనిపోతానని ఓ కాగితాన్ని కిందికి రాసి వదిలాడు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు చంద్రమౌళిని సముదాయించినా వినకుండా స్తంభం నుండి కిందకు దిగడం లేదు. జగ్గారెడ్డి వస్తారో లేదో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed