- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీతో గడిపిన ప్రతీ రోజు ప్రత్యేకమైనది.. స్టార్ హీరో పోస్ట్..
దిశ, సినిమా: ట్విలైట్ స్టార్ టేలర్ లాట్నర్ గత కొద్ది కాలంగా చిన్ననాటి స్నేహితురాలు ‘టే డోమ్’తో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పెళ్లి చేసుకుంటానంటూ చేసిన ప్రపోజల్‌కు తనుకూడా అంగీకారం తెలిపింది. టేలర్ వెంటనే తను తెచ్చిన ఉంగరం తొడిగాడు. ఈ గుడ్ న్యూస్‌ను అభిమానులతో పంచుకున్న టేలర్.. ‘టే.. నీతో జీవితం పంచుకోవడానికి ఇక వేచి చూడలేను. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు. ఎప్పుడూ అసహ్యించుకోవని కోరుకుంటున్నా.
నేను ఆందోళనగా ఉన్నప్పుడు నీవు నన్ను శాంతింపజేస్తావు, నవ్విస్తావు, నీతో గడిపిన ప్రతి రోజూ చాలా ప్రత్యేకమైనది. నీ జీవితంలోకి ఆహ్వనించినందుకు కృతజ్ఞతలు. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. ఇక తను పోస్ట్ చేసిన పిక్‌లో మోకాళ్లపై ‘టే’కు ప్రపోజ్ చేస్తూ కనిపించగా.. “11.11.2021 రోజు నా కోరికలన్నీ నెరవేరాయి’ అనే క్యాప్షన్ ఇచ్చాడు.