రాయితీ పొడిగించకపోతే టీవీ ధరలకు రెక్కలు..!

by Shyam |
రాయితీ పొడిగించకపోతే టీవీ ధరలకు రెక్కలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: టీవీ ప్యానెల్స్‌పై ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఈ నెలాఖరుతో ముగియనుండడంతో వచ్చే నెల నుంచి టీవీల ధరలు పెరగుతాయనే అంచనాలున్నాయి. ప్రభుత్వం సెప్టెంబర్ 30 తర్వాత డ్యూటీ రాయితీని పొడిగించకపోతే కస్టమర్లకు టీవీల కొనుగోలులో అదనపు భారం తప్పదని ఇప్పటికే పలు కంపెనీలు వెల్లడించాయి. గతేడాది ఓపెన్ సెల్ ప్యానెళ్లపై 5 శాతం దిగుమతి పన్ను రాయితీని ప్రభుత్వం కల్పించింది. అదనంగా టీవీ తయారీకి కావాల్సిన ప్యానెళ్ల రేట్లను 50 శాతానికి పెంచింది.

ఇప్పటికే శాన్సుయ్, ఎల్‌జీ, థామ్సన్, పానాసోనిక్ కంపెనీలు సెప్టెంబర్ 30 తర్వాత డ్యూటీ రాయితీ పెంచకపోతే వినియోగదారులపై ఆ మేరకు భారం పడుతుందని తెలిపాయి. 32 ఇంచుల టీవీలపై 4 శాతం అనగా రూ. 600, 42 ఇంచుల టీవీలపై రూ. 1200 నుంచి రూ. 1500 వరకు పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాగా, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ టీవీల తయారీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగుమతి పన్నుల రాయితీ గడువును పెంచేందకు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Read Also..

మరింత కమర్షియల్‌గా మారనున్న ఇన్‌స్టాగ్రామ్

Advertisement

Next Story

Most Viewed