- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్…వాహనాల అమ్మకాలు లుక్‌డౌన్!
దిశ, వెబ్‌డెస్క్: అసలే మందగమనం..ఆపై కరోనా కొరడా! ప్రస్తుతం అన్ని రంగాలకు వాతలు తప్పట్లేదు. గతేడాదితో పోలిస్తే 2020 మార్చిలో టీవీఎస్ కంపెనీ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 55 శాతం పతనమయ్యాయి. మార్చి నెలలో టీవీస్ వాహనాలు 1,33,988 యూనిట్లను విక్రయించింది. 2019 మార్చిలో 3,10,885 యూనిట్లు అమ్ముడుపోయినట్లు సంస్థ వెల్లడించింది. దేశీయంగా మార్చి నెలలో 94,103 యూనిట్లను విక్రయించగా, గతేడాది 2,47,694 యూనిట్లు అమ్మకాలతో పోలిస్తే అత్యంత దారుణమైన పతనమని తెలుస్తోంది.
మోటార్ సైకిల్ అమ్మకాల్లు గతేడాది మార్చిలో 1,41,086 యూనిట్లు అమ్ముడుపోగా, ఈ మార్చిలో కేవలం 66,673 యూనిట్లకు తగ్గాయి. స్కూటర్ అమ్మకాలు సైతం 98,447 నుంచి 34,191 యూనిట్లకు క్షీణించాయి. ఎగుమతుల అమ్మకాలకు కూడా కష్టాలు తప్పలేదు. 2019 మార్చిలో 76,405 యూనిట్ల ఎగుమతులు జరగ్గా, ఈ ఏడాది మార్చిలో 50,197 యూనిట్లను మాత్రమే ఎగుమతులు చేయగలిగింది.
కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్ ఏర్పడటంతో మందగించిన ఆటోమొబైల్ రంగానికి అమ్మకాల బెడద తప్పలేదు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 37.57 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 17.7 శాతం క్షీణించి 30.89 లక్షల యూనిట్లను మాత్రమే విక్రయించింది. త్రీవీలర్లు కూడా లాక్‌డౌన్ కారణంగా గతేడాది మార్చితో పోలిస్తే అమ్మకాలు తగ్గాయి. అయితే, మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే 11 శాతం అమ్మకాలు పెరిగాయి.
కేవలం టీవీఎస్ మాత్రమే కాదు మొత్తం ఆటోమొబైల్ రంగమే తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న్నాయి. మార్చి నెల అమ్మకాల్లో చాలా సంస్థలు తగ్గుదలను నమోదు చేశాయి. ఇండియాలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతీ సుజుకీ 47.4 శాతం క్షీణించగా, మహీంద్రా అండ్ మహీంద్రా 88 శాతం క్షీణతను నమోదు చేశాయి. హ్యూండాయ్ సంస్థ 47.21 శాతం పతనాన్ని చూసింది. ఆర్థిక మందగమనంతో పాటు, కరోనా వ్యాప్తితో లాక్‌డోఉన్ ప్రభావం, బీఎస్-వీ ఇంజిన్‌లకు వాహనాలను మాడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపించాయని కంపెనీలు చెబుతున్నాయి.
Tags: TVS, Coronavirus, covid-19, lockdowns