- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సిద్దిపేటలో అరుదైన చికిత్స.. క్యాన్సర్ కణతి తొలగింపు
దిశ, సిద్దిపేట: సిద్దిపేటలోనీ మెడికేర్ రీచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. పది రోజుల కిందట సిద్దిపేట ప్రాంతానికి చెందిన 53 సంవత్సరాల వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చాడు. వైద్యులు అతనికి స్కానింగ్ ద్వారా చిన్న ప్రేగుకి కణతి ఉన్నట్లు గుర్తించారు. రోగి చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లే స్థోమత లేకపోవడంతో ఆస్పత్రి వైద్యులు ఆనంద్, త్రివిక్రమ్, పర్షరాములు, రమలు నాలుగు గంటల పాటు శ్రమించి సుమారు మూడు కిలోల కణతిని విజయవంతంగా తొలగించినట్లు తెలిపారు. అట్టి కణతిని వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ కు పంపినట్లు తెలిపారు. రూ. మూడు లక్షలకు పైగా ఖర్చు అయ్యే ముఖ్యంగా ఇలాంటి కేసులు హైదరాబాద్ లాంటి కార్పొరేట్ ఆసుపత్రులలో మాత్రమే చేస్తారని వెల్లడించారు. లక్షల్లో ఒక్కరిద్దరికి మాత్రమే వచ్చే ఈ వ్యాధిని జేజేనల్ ఎడినోవా కార్సినోవగా పిలుస్తారని అన్నారు. ఇలాంటి జబ్బులు మద్యం సేవించడం, స్మోకింగ్ చేయడం, నూనె వస్తువులు, కొవ్వు పదార్థాలు తీసుకోవడం, మోషన్ ప్రాబ్లం ఉండే వారికి చిన్న ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ లాంటి కార్పొరేట్ ఆసుపత్రులలో నిర్వహించే చికిత్సలు తక్కువ ఖర్చుతో సిద్దిపేట పట్టణంలో నిర్వహిస్తున్నామని.. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.