- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సెన్సేషనల్ న్యూస్ : గులాబీ గూటికే.. క్లారిటీ ఇచ్చిన ఎల్.రమణ
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ గులాబీ పార్టీలో చేరనున్నారు. గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలను బలం చేకూరింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కారులో గురువారం సాయంత్రం ప్రగతి భవన్‌కు చేరుకున్న ఎల్.రమణ సుమారు గంట పాటు కేసీఆర్‌తో చర్చించారు. “మంత్రి ఎర్రబెల్లితో కలిసి వెళ్లాను. నన్ను పార్టీలోకి రావాల్సిందిగా కోరారు. నిర్ణయం సానుకూలంగానే ఉంటుందని చెప్పాను. తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించాను. కలిసిరావాలని కేసీఆర్ కోరారు’’ అని ఎల్.రమణ మీడియాకు వివరించారు. సామాజిక తెలంగాణ అంశాన్ని కేసీఆర్ వివరించారని, తాను కూడా సానుకూలంగానే స్పందించానని వివరించారు. కాగా, ఆయన ఈనెల 12న లాంఛనంగా టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బహిష్కరించిన తర్వాత నాటకీయంగా జరిగిన పలు రాజకీయ పరిణామాల్లో భాగంగా ఎల్.రమణ సైతం టీఆర్ఎస్ నేతలతో టచ్‌లోకి వెళ్లారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వయంగా చొరవ తీసుకుని చర్చలు జరిపారు. త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. మీడియా ప్రతినిధులు సైతం ఇదే విషయాన్ని ఆయనతో ప్రస్తావించారు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఏ పార్టీలో చేరాలో ఖరారు చేసుకోలేదని బదులిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రగతి భవన్ వేదికగా చర్చలు జరగడం విశేషం. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో సస్పెన్స్ వీడనుంది.
నేతన్నల అంశాలపై చర్చించాం : ఎర్రబెల్లి
టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ అంటే కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానమని, చేనేత కుటుంబం నుంచి వచ్చిన ఆయన అవసరం టీఆర్ఎస్‌కు ఉందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. చేనేతవర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేసిందని, ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉందని, ప్రస్తుతం ఆ సెక్షన్ ప్రజల కోసం కొత్త పథకాల గురించి సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిందిగా ఎల్.రమణను కేసీఆర్ కోరారని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎల్.రమణతో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నదని, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికిలో ఉండే అవకాశమే లేదన్నారు.