కరోనా కట్టడికి టీటీడీ భూరి విరాళం

by srinivas |
కరోనా కట్టడికి టీటీడీ భూరి విరాళం
X

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురికి ఉపాధి లేకుండా పోయింది. ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ… ప్రభుత్వాలే జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు సంస్థలు జీతాలు చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పలువురు ఆకలితో అలమటిస్తున్నారు.

ఇక పేదలు, వలస కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఊరెళ్దామనుకుంటే వాహనాలు లేవు. ఉన్నచోట పని లేదు. పని లేనికారణంగా రూకలు లేవు. రూకలు లేని కారణంగా పెరిగిన నిత్యావసర వస్తువులను కోనుగోలు చేసే శక్తి లేదు. దీంతో ఆకలితో అలమటిస్తున్నారు. వారందరి ఆకలి దూరం చేయాలన్న ఆలోచనతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూరి విరాళం ప్రకటించింది.

టీటీడీ అన్నదానం ట్రస్టు నుంచి జిల్లాకు కోటి రూపాయల చొప్పున.. 13 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా అందించింది. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలస కార్మికులు ఆహారం కోసం ఇబ్బంది పడకూడదని, వారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతోనే విరాళం అందజేశామని టీటీడీ తెలిపింది. పేదలకు అన్నదానం నిమిత్తం ఈ నిధులను వినియోగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

tags:ttd, tirumala, cm relief fund, coronavirus, covid-19, lockdown

Advertisement

Next Story

Most Viewed