టీటీడీ మరో సంచలన నిర్ణయం.. చరిత్రలోనే మొదటిసారి వారికి నోటీసులు

by srinivas |   ( Updated:2021-09-13 03:55:57.0  )
టీటీడీ మరో సంచలన నిర్ణయం.. చరిత్రలోనే మొదటిసారి వారికి నోటీసులు
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా ఒకేసారి 49 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులిచ్చింది. హౌస్ బిల్డింగ్ లోన్ జారీలో అవకతవకలకు పాల్పడ్డారంటూ 49 మంది ఉద్యోగులకు ఈవో జవహర్‌రెడ్డి సోమవారం నోటీసులు జారీ చేశారు. ఇంతమంది ఉద్యోగులుకు నోటీసులు ఇవ్వడం టీటీడీ చరిత్రలో ఇదే ప్రథమం. ఇకపోతే నోటీసులు అందుకున్న వారిలో డిప్యూటీ ఈవో నుంచి అటెండర్ వరకు ఉద్యోగులు ఉన్నారు. అయితే ఇంకా విచారణ జరుగుతుందని.. మరికొంత మందికి నోటిసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే టీడీపీ ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణంలో ఏడుగురు ఉద్యోగులను డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story