జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్

by Anukaran |
TS RTC MD Sajjanar
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ తీసుకొస్తున్న పలు మార్పులు ప్రయాణికులతో పాటు సంస్థ కార్మికుల్లోనూ ఉత్తేజాన్ని తీసుకొస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం సజ్జనార్ నిత్యం నూతన సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా పలువురు జర్నలిస్టుల సూచన మేరకు సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకు అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులు బస్సు ప్రయాణంలో టికెట్ తీసుకునేందుకు.. ప్రత్యేక బస్సు పాస్‌ చూపించి 2/3 కన్సెషన్ ఆప్షన్‌ కింద టికెట్ తీసుకునేవారు. తాజాగా టీఎస్ ఆర్టీసీకి చెందిన వెబ్‌సైట్ నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకునేందుకు రాయితీతో కూడిన అవకాశం ఇచ్చారు సజ్జనార్. ఈ సందర్భంగా TSRTC వెబ్‌సైట్‌లో జర్నలిస్టు 2/3 కన్సెషన్ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ విషయంపై సూచనలు తెలిపిన జర్నలిస్టులకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story