రైతులకు అలా కాదు ఇలా ఇవ్వండి!

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: రైతులకు హామీ లేని రుణాలివ్వాలని, ముద్ర, ఎంఎస్ఎంఈలకు ఇస్తున్న రుణాల లాంటివి వ్యవసాయ రంగానికి అవసరమని తెలంగాణ స్టేట్ డెట్ రిలీఫ్ కమిషన్ (టీఎస్డీసీ) మెంబర్ పాకాల శ్రీహరి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఓ లేఖ రాశారు. దేశంలో 50 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నందున వారికి ప్రభుత్వం రూ.2 లక్షల వరకు దీర్ఘ కాలిక రుణాలివ్వాలని సూచించారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు రైతుల దగ్గర 36 నుంచి 48 శాతం దాకా వడ్డీ వసూలు చేస్తున్నారని తెలిపారు. ఎన్ని ఎకరాలున్న రైతుకైనా కేవలం రూ. 1.60 లక్షల పరిధిలోపే బ్యాంకులు హామీ లేని రుణాలు ఇస్తున్నాయని, ఇంకా ఎక్కువ కావాలంటే భూమి తాకట్టు పెట్టమంటున్నారని వివరించారు. ఇలా కాకుండా ఎకరానికి రూ.40 వేల చొప్పునా.. ఎన్ని ఎకరాలుంటే అన్నింటికీ ఇచ్చేలా బ్యాంకులను ఆదేశించాలని ఆ లేఖలో శ్రీహరిరావు ఆర్థిక మంత్రిని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed