- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయాలి: ఎండీ సునీల్ శర్మ
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వ సహకారంతో సంస్థను బలోపేతం చేసేందుకు అందరూ కంకణబద్దులు కావాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పిలుపునిచ్చారు. కరోనాతో సహజీవనం చేస్తూనే ప్రయాణికులకు సేవలు అందించడానికి ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. మంగళవారం హైదరబాద్‌లోని బస్‌భవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఎండీ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురువేసి ప్రసంగించారు. బస్సులు, బస్సు స్టేషన్‌లను శుభ్రంగా ఉంచుతూ అటు ప్రయాణికులకు ఇటు సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అంకితభావంతో పనిచేసి గడిచిన ఏడాదిలో సాధించినట్లుగా ఈ సంవత్సరం కూడా అవార్డులు సాధించి సంస్థ పేరు ప్రఖ్యాతులు కాపాడాలని సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన కోరారు.
Advertisement
Next Story