బత్తాయి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

by Shyam |
బత్తాయి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
X

దిశ, నల్లగొండ: అకాల వర్షాలకు పంట నష్టపోయిన బత్తాయి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని చండూరు మండలం చామలపల్లి గ్రామంలో బత్తాయి పంటకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ దీక్ష చేపట్టిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షపాతి అని పదే పదే చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం బత్తాయిలకు మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.దేశ రాజధానిలో కొలువుదీరిన ఆప్ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నప్పటికీ, తెలంగాణలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే బత్తాయి రైతులు దళారులను ఆశ్రయించి టన్ను రూ.5 వేలకు అమ్ముకుని అప్పుల పాలవుతున్నారని విమర్శలు చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల నుంచి బత్తాయి పంటను కొనుగోలు చేయాలని, మద్దతు ధర కూడా కల్పించాలని కోరారు.

tags : mosambi farmers, ts govt will help, bjp state secretary manohar reddy, demand

Advertisement

Next Story

Most Viewed