వీధి వ్యాపారులకు అండగా ప్రభుత్వం

by Shyam |
వీధి వ్యాపారులకు అండగా ప్రభుత్వం
X

దిశ, న్యూస్​బ్యూరో: లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇబ్బందులు ప‌డుతున్న వీధి వ్యాపారుల‌కు ఆర్థికంగా అండ‌గా నిలిచేందుకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లలో వీధి వ్యాపారుల‌ను గుర్తించి న‌మోదు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5ల‌క్షల మంది వీధి వ్యాపారుల‌కు బ్యాంకుల ద్వారా త‌క్కువ వ‌డ్డీతో రూ. 10వేల చొప్పున రుణం మంజూరు చేయించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

గురువారం సాయంత్రం నగరంలోని మెహిదీప‌ట్నం రైతుబ‌జార్‌, దాని ప‌రిస‌ర ప్రాంతాల‌ను సీఎస్​ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా సోమేష్​ కుమార్​ మాట్లాడుతూ వీధి వ్యాపారుల‌ను గుర్తించి ప్రత్యేక యాప్ ద్వారా న‌మోదు చేసి గుర్తింపు కార్డులు జారీచేస్తున్నట్లు తెలిపారు. ఒకసారి న‌మోదు అయితే ప్రభుత్వం ద్వారా ప్రోత్సహ‌కాలు పొందే అవ‌కాశం క‌లుగుతుంద‌ని తెలిపారు.ఇప్పటివ‌ర‌కు రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 16వేల మంది వీధి వ్యాపారుల‌ను న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. ఆయనతో పాటు పుర‌పాల‌క శాఖ ప్రన్సిప‌ల్ సెక్రట‌రీ అర్వింద్ కుమార్‌, జీహెచ్‌ఎంసీ లోకేష్ కుమార్‌, మెప్మా ఎండి స‌త్యనారాయ‌ణ‌, జోనల్ కమీషనర్ ప్రావీణ్య, అదనపు కమీషనర్ శంకరయ్య, పీడీ సౌజన్య ఈ పర్యటనలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed