- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల కోసమే అబద్దాలు ఆడారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: దుబ్బాక ఎన్నికల్లో రైతుల ఓట్ల కోసమే మక్కలకు క్వింటాల్ కు రూ 100 నుంచి 150 ఎక్కువ ఇస్తామని సీఎం కేసీఆర్ అబద్దాలు చెప్పారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ….
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని జోస్యం చేప్పారు. నియంత్రిత సాగు పేరుతో సన్న రకం సాగు చేయాలని, మంచి ధర ఇప్పిస్తానని చెప్పి ఇప్పుడు కేసీఆర్ మాట తప్పారనీ అన్నారు. సీయం కేసీఆర్ తీరుతో రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. కేంద్రం ఇస్తున్న ఎంఎస్‌పీకి ఒక్కరూపాయి కూడా ఎక్కువ ఇవ్వటం లేదని ఆరోపించారు. కడ్త పేరుతో 9శాతం తరుగు తీస్తున్నారని చెప్పారు. పౌల్ట్రీ యజమానుల కోసం మక్క రైతులను, రైస్ మిల్లర్ల కోసం వరి రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. అంది వచ్చిన అవకాశంగా రైస్ మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని అన్నారు. పసుపు బోర్డు కన్నా మంచి వ్యవస్థను కేంద్రం ఇచ్చినా, రైతులను టీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ తీరుతో ప్రభుత్వాలపై రైతులకు నమ్మకం పోతోందని అన్నారు. ముస్లీంలకు కేంద్రం అన్ని ఇస్తున్నా వారిని కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నాడని తెలిపారు.