- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కారు’ దిగేందుకు రెడీ.. మున్నూరుకాపులను వాడుకుని వదిలేస్తారా..?
దిశ, భద్రాచలం : అధికార టీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గంలో మున్నూరుకాపులను తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మున్నూరుకాపుల ఓట్లు నియోజకవర్గంలో సుమారు 20 వేలకుపైనే ఉన్నాయి. రాజకీయ చైతన్యం కలిగిన మున్నూరుకాపులు ప్రతీ ఎన్నికలలో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అది గుర్తించే టీఆర్ఎస్ పార్టీ కిందటిసారి మున్నూరుకాపులకు చెందిన బండి వేణుని చర్ల మండల ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయన సమర్థవంతంగా పనిచేసి ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే, పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మున్నూరుకాపుల ఓటు బ్యాంకును కారు గుర్తు వైపు మరల్చి టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ఎంతగానో కృషి చేశారనేది జగమెరిగిన సత్యం.
మండల కేంద్రమైన చర్లలో పార్టీకి వేణు వెన్నుదన్నుగా నిలిచారనడం అతిశయోక్తి కాదు. పార్టీని ఒంటి చేయితో నడిపించిన బండి వేణుకి గ్రూపు గొడవల మూలంగా ఈసారి మండల కమిటీలో చోటుదక్కలేదు. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన ఆయనకు జిల్లా కమిటీలో స్థానం కల్పించాలని మున్నూరుకాపులు పార్టీ నాయకత్వానికి విన్నవించారు. గులాబీ పార్టీ అగ్రనాయకులు అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పించకుండా ఎంతసేపు పద్మశాలి, గిరిజన జపం చేస్తున్నారనే ఆరోపణలు నెలకొన్నాయి. పద్మశాలిలకు చర్లలో నాలుగు కీలక పదవులు ఇవ్వడంపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. నాయకులకు నచ్చిన వారికే పార్టీ పదవులా? అని గులాబీ కార్యకర్తలు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ వైపు మున్నూరు కాపుల చూపు..
టీఆర్ఎస్ పార్టీలో తగిన గుర్తింపు లభించకపోతే పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరేందుకు బండి వేణుతో సహా పలువురు యోచిస్తున్నట్లు సమాచారం. ఆయన రాకకోసం కాంగ్రెస్ పార్టీ ద్వారాలు తెరిచినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో మున్నూరుకాపులు కీలకంగా ఉన్నారు. బండి వేణుని చేర్చుకొని టౌన్‌లో టీఆర్‌ఎస్ పార్టీని బలహీనపర్చాలనే వ్యూహంతో కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు బీఎస్‌పీలో చేరాలని బండి వేణుపై ఆయన మద్దతుదారులు వత్తిడి చేస్తున్నట్లుగా తెలిసింది. టీఆర్ఎస్ అగ్రనాయకత్వ తీరుపై అసంతృప్తితో ఉన్న బండి వేణు జిల్లా కమిటీ వరకు వేచిచూసి తదుపరి తన రాజకీయ భవిష్యత్తుకు మార్గం వేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఈసారి నూతన కమిటీల సందర్భంగా మునుపెన్నడూలేని సమస్యలతో సతమతమౌతోంది. భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల మండలాల్లో పదవులు దక్కని పలువురు నాయకులు తాత్కాలికంగా మౌనంగా ఉన్నా మున్ముందు పార్టీ వీడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
- Tags
- congress party