- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ ఆదేశం.. టౌన్ కమిటీ కుర్చీ కోసం టీఆర్ఎస్ నేతల కొట్లాట
దిశ, పెద్దపల్లి : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సుల్తానాబాద్ టౌన్ కమిటీని ఎన్నుకునేందుకు సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాటల యుద్ధం కొనసాగింది. వర్గపోరు బయటపడింది. యువజన సంఘం తరపున ఇద్దరు నేతలు పోటీ పడగా వారి మధ్య తోపులాట జరిగి, చైర్లు విసురుకునే స్థాయికి చేరుకున్నట్లు తెలిసింది. ఈ విషయం మీడియా కంట పడకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. తెరాస నేతల మధ్య జరిగిన యుద్ధం చర్చనీయాంశంగా మారింది.
వ్యవసాయ మార్కెట్ కమిటీలో అధికార తెరాస సమావేశం ఎలా నిర్వహిస్తారని పలువురు ప్రశ్నించారు. మీడియాకు సమాచారం అందించకుండా వారికి వారే తమ అధ్యక్షుల పేర్లు ప్రకటించుకున్నారు. నేడు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే దాసరి మనోహర రెడ్డి గైర్హాజరు కావడంతో కొంత గొడవ తక్కువ అయిందని, ఎమ్మెల్యే హాజరైతే గొడవ ఎక్కువ జరిగే అవకాశం ఉండేదని పలువురు తెరాస నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి తెరాసలో ముసలం మొదలయ్యింది. చాలా మంది సీనియర్ నాయకులకు సమాచారం అందించలేదని అలిగినట్లు తెలిసింది. గతంలో కూడా నాయకుల మధ్య ముష్టి యుద్ధం జరిగిన విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.