- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: ఎంపీ అరవింద్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని సంచలనాలు జరుగుతాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఆదివారం మీడియాతో ఆయన నివాసంలో మాట్లాడారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని అన్నారు. పార్టీలో చేరి పనిచేయని నేతలను సహించేది లేదన్నారు. పార్టీలోకి చేరేందుకు కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. తన ద్వారా పార్టీలోకి వచ్చినంత మాత్రాన టికెట్ గ్యారెంటీ లేదని అన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు స్థానాలలో ఉమ్మడి జిల్లాలో 9కి 9 స్థానాలు గెలవడమే నా లక్ష్యం అని అన్నారు. బీజేపీ పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి కూడా పోటీ చేస్తానని అన్నారు. పార్టీ ఆదేశానుసారం ఏ స్థానంలోనైనా పోటీకి సిద్ధమని అన్నారు. తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసిందని, రానున్న రోజుల్లో పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య పొత్తుకు అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ పై అందుకే బీజేపీ దూకుడుగా ఉందని తెలియజేశారు. ఈడీ నోటీసుల భయంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పరుగులు తీశారని తెలిపారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబం విదేశాలకు పరారు కావడం ఖాయమన్నారు. రాజ్యసభ సభ్యులు తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరాలన్నది ఆయన నిర్ణయమే అంతిమమని ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ అన్నారు.