టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పాటలు మారిపోయాయని, కళాలు.. గళాలు మౌనంగా ఉంటే క్యాన్సర్ వ్యాధికంటే ప్రమాదకరమని అన్నారు. ఇప్పుడు ప్రతీ గాయకుడు ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు ఆ కంపెనీ పరిధిలోనే బతకాలని, సింగరేణిలో పనిచేస్తూ ఇంకో దగ్గర పనిచేస్తా అంటే నడవదని పేర్కొన్నారు. ప్రస్తుతం నేను లిమిటెడ్ కంపెనీలో ఉన్నట్లు భావించుకుంటున్నా అన్న ఎమ్మెల్యే రసమయి .. నేను ఎమ్మెల్యే అయ్యాక చాలామంది దూరమయ్యారన్నారు. చాలా సమస్యలు ఉంటాయి.. కానీ నన్ను అనాల్సిన పనిలేదన్నారు.

Advertisement

Next Story