బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్

by Shyam |
TRS MLA Kranti Kiran
X

దిశ, ఆందోల్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేస్తోన్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంత్రి కిరణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… బండి సంజయ్‌ది పాదయాత్ర కాదని, చాలా విలాసవంతమైన యాత్ర అని ఆరోపించారు. ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో అని ప్రజలు అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కేవలం కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయడానికే పాదయాత్ర చేస్తున్నాడని, సమస్యలు తెలుసుకోవడానికి ఏమాత్రం కాదని మండిపడ్డారు. పాదయాత్రలో ఆయన మాట్లాడుతున్న మాటలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టులాంటిది అన్నారు. ప్రజల్లో జోకర్‌గా బండి సంజయ్ మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. ఆందోల్ కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న జాతీయ రహదారి విషయంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సంజయ్ తెలివితేటలకు నిదర్శనం అన్నారు. రోడ్డు కోసం కేంద్రానికి అనేక లేఖలు రాశామని గుర్తుచేశారు.

నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసినందుకే బాబు మోహన్‌కు రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, రాబోయే ఎన్నికల్లో అవి కూడా రావని సూచించారు. బాబుమోహన్ నువ్వు కామెడీ యాక్టర్‌వి కావొచ్చు.. కానీ, నాకు 20 ఏండ్ల జర్నలిజం అనుభవం ఉందని గుర్తుచేశారు. రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో ఎక్కడైనా సరే తోటివారిని అవమానించడమే బాబుమోహన్‌కు తెలిసిన విద్య అని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ గుప్తా, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఎంపీపీ జోగు బాలయ్య, జెడ్పీటీసీ రమేష్, వైస్ ఎంపీపీ మహేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మాచర్ల విజయ్ కుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చాపల వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story