- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేవంత్ దమ్ముంటే.. హుజురాబాద్‌లో పోటీ చెయ్
దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే హుజురాబాద్‌లో పోటీ చేయ్’’ అని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం టీఆర్ఎస్‌ఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తే నాలుక కోస్తా అని హెచ్చరించారు. అనువంత మెదడు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. ఆరోపణలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని. ఫిట్టింగ్‌లు కటింగ్‌లో సెట్టింగ్‌లు కేరాఫ్ అన్నారు. రేవంత్ తీరు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంది అని ఎద్దేవా చేశారు. ఆయన కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోవు సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజనులపై ప్రేమతో కాకుండా బిళ్ల నుంచి డబ్బులు వసూలు చేయడం కోసమే సభ ఏర్పాటు చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ 20 నెలలు కాదు ఇరవై ఏళ్ళు పరిపాలిస్తారు అని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినందుకే కేసీఆర్‌ని జైల్లో పెట్టి ఇస్తావా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి నువ్వు సీఎం కాలేవు కదా, కనీసం, అసిస్టెంట్ కూడా కాలేవని మండిపడ్డారు. కేసీఆర్‌తో పెట్టుకుంటే ఎవడూ మిగలడు అని హెచ్చరించారు. మేము బొంద పెట్టాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ నాయకులే గాంధీభవన్‌లో బొంద పెడతారని హెచ్చరించారు. కేసీఆర్ తెలంగాణ సాధించడం మూలంగానే రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ అయ్యాడని దుయ్యబట్టారు. రెండుసార్లు పీసీసీ అధ్యక్ష పదవిని చేసిన డి.శ్రీనివాస్ టీఆర్ఎస్‌కు వస్తే రాజ్యసభ టికెట్ ఇచ్చామని, ఆయన లెక్క రేవంత్ మిగులుతారని జోస్యం చెప్పారు. నీకు దమ్ముంటే వందమంది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల లిస్టు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు.